ఎస్బీఐ నుంచి సూపర్ యాప్.. అన్నిటికీ  ‘యొనో ’ - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్బీఐ నుంచి సూపర్ యాప్.. అన్నిటికీ  ‘యొనో ’

November 24, 2017

లీడింగ్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ  ఒక కొత్త బ్యాంకింగ్ వేదికను సిద్ధం చేసింది. ‘ యొనో ’ ( యూ ఓన్లీ నీడ్ వన్ ) పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇది డిజిటల్ బ్యాంకింగ్‌లో ముందడుగు. ఈ యాప్ ద్వారా ట్రావెల్, క్యాబ్ బుకింగ్, హోటల్స్, వినోదం, డ్రైవింగ్, రెంటింగ్ వంటి సుమారు 14 కేటగిరీల్లో వినియోగదారులు వినియోగించుకోవచ్చని ఎస్బీఐ వెల్లడించింది.  ఉబర్,  అమెజాన్, జబాంగ్, ఓలా, మింత్రా, షాపర్స్ స్టాప్, ఎయిర్‌బీఎన్బీ వంటి 60 ఈ కామర్స్ సంస్థలతో క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ల ఆఫర్ల గురించి ఒప్పందం కుదుర్చుకున్నది. ఆధార్ నెంబరు, వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ ధ్రువీకరణతో ఇంటి వద్ద నుంచే సేవలు అందుకోవచ్చుని తెలిపారు. ఇది డిజిటల్ బ్యాంకే అయినప్పటికీ ఎస్బీఐలో భాగంగానే వుంటుందని ఎస్బీఐ ఎండీ పీకే. గుప్తా పేర్కొన్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ అథెంటికేషన్ లేకుండా పరిమితికి మించి లావాదేవీలు జరిపే అవకాశం లేనందున.. ఏదో ఒక బ్రాంచిలో బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తిచేసుకోవాలన్నారు.

 వెబ్, యాప్ రెండువిధాలుగానూ యొనో అందుబాటులో వుంటుంది.  ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌లపై పనిచేస్తుంది యొనో. మొబైల్ ఫోన్ ద్వారానే డిజిటల్ ఖాతాలు తెరవడం  ( క్యాష్ డిపాజిట్, విత్‌డ్రా సేవలు మినహా ), బుకింగ్‌లు, ఆన్‌లైన్ షాపింగ్, ఆర్డర్లు వంటి అన్ని రకాల వాణిజ్య ఉత్పత్తుల కొనుగోలు సహా పలు సేవలు అందించనుంది. ఫండ్ ట్రాన్స్‌ఫర్, పత్రాలు నింపే పనిలేకుండా ముందస్తు వ్యక్తిగత రుణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఓవర్‌ డ్రాప్టులు పొందేందుకు కూడా ఇదే యాప్ వినియోగించుకోవచ్చునని ఎస్బీఐ వెల్లడించింది.