ఓటర్ స్లిప్పులు ఇక యాప్‌లో

 ఓట్లు అనగానే ఇంటింటికి తిరిగి స్లిప్పులు ఇస్తారు. ఇకపై అలాంటి రిస్క్ లేకుండా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓ వెసలుబాటును కల్పిస్తోంది. మొబైల్ యాప్‌ ద్వారా ఓటరు స్లిప్పును పొందే అవకాశాన్నికల్పించింది. tsec.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఓటర్ స్లిప్పు పొందే అవకాశం కల్పించిన రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా… యాప్ ద్వారా కూడా పొందే అవకాశాన్ని కల్పించింది.

Telugu news SEC launches Te-Poll app for benefit of voters in Telangana .....

 

ఓటరు స్లిప్పులను Te-Poll యాప్‌ ద్వారా పొందవచ్చు. యాప్‌ ద్వారా జిల్లా పేరు, ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేస్తే ఓటరు స్లిప్పు వస్తుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ప్లేస్టోర్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Telugu news SEC launches Te-Poll app for benefit of voters in Telangana