మొక్కతో సెల్ఫీ దిగి అరెస్ట్ అయ్యాడు ? - MicTv.in - Telugu News
mictv telugu

మొక్కతో సెల్ఫీ దిగి అరెస్ట్ అయ్యాడు ?

February 5, 2018

ఓర్ని ఇదేంటి మొక్కతో సెల్ఫీ దిగితే  అరెస్ట్ చేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారా? మరి అది మామూలు మొక్క కాదు గంజాయి మొక్క..అందుకే ఆ యువకుడు  ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. తమిళనాడుకు చెందిన శశికుమార్..నగరంలోని దర్గా వీధిలో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఇంటి టెర్రస్ పై చాలా మొక్కలు కనిపించడంతో వాటితో ఫోటో దిగాడు.ఇంటికి వచ్చిన తర్వాత వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అవి కాస్త వైరల్ అయ్యాయి. అలా వైరల్ అవుతూ చివరకు ఆ ఫోటోలు పోలీసులకు చేరాయి. ఆ కుర్రాడు సెల్పీ దిగింది ఓ గంజాయి మొక్కతో అని గుర్తించిన పోలీసులు అతడిని ఆ మొక్కలను పెంచుతున్న అతడి స్నేమితుడిని అరెస్ట్ చేశారు. సెల్ఫీలు తీసుకుంటే లైకులు కామెంట్లు వస్తాయనకుంటే వాటితో పాటు జైల్లో చిప్పకూడు కూడా బోనస్ గా వచ్చింది అని ఆ యువకుడు లబోదిబో మంటున్నాడు.