సెల్ఫీ మోజుతో నీళ్లల్లో ప్రాణాలు - MicTv.in - Telugu News
mictv telugu

సెల్ఫీ మోజుతో నీళ్లల్లో ప్రాణాలు

November 20, 2017

సెల్ఫీల మోజు మీద మన్నువడ, సెల్ఫీలతోని ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఒకరేమో పాముతో సెల్ఫీ అంటడు, ఇంకోడు కొండ అంచున నిలవడి సెల్ఫీ అంటడు. థ్రిల్ కోసమని రిస్క్ తీసుకుని మరీ సెల్ఫీలకోసం ఆరాటపడుతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

హైద్రాబాద్‌లోని ఎంజే మార్కెట్‌కు చెందిన ఐఐటీ విద్యార్థి నరేన్  రెండురోజుల క్రితం స్నేహితులతోని కలిసి ఉత్తరాఖండ్‌కు విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ జలాశం మంచిగుందని అంచున నిలబడి సెల్ఫీ తీసుకోబోయాడు, కానీ ప్రమాదవశాత్తు జలాశయంలో పడి మృతి చెందాడు.

ఐఐటీలో మంచి ర్యాంకు సాధించి మీకు మంచి పేరు తెస్తానని చెప్పిన కొడుకు కళ్లముందు జీవచ్చవంలా పడి ఉండడం చూసి నరేన్ తల్లిదండ్రులు గుండె పగిలేలా ఏడ్చారు. అందుకే  ప్రమాద అంచుల్లో సెల్ఫీలు తీసుకోకండి, మిమ్మల్ని నమ్ముకున్నోళ్లను కన్నీటి పాలు చెయ్యకండి.