మీసెల్ఫీల మన్నువడ..ఎన్క మీదోస్తు సచ్చిపోతుండ్రా - MicTv.in - Telugu News
mictv telugu

మీసెల్ఫీల మన్నువడ..ఎన్క మీదోస్తు సచ్చిపోతుండ్రా

November 20, 2017

సూశిన్రా వీళ్ల సెల్ఫీ పిచ్చి..పాపం వెనక వాళ్ల దోస్తు ఈత రాక నీళ్లల్ల మునిగిపోతుంటే వీళ్లు సెల్ఫీలల్ల మునిగిపోయారు. ఒక్కడన్న అటు జూస్తే అయిపోవు. బెంగుళూరుకు 30 కిలోమీట్లర్ల దూరంలో ఉన్న ఓ హనుమాన్ గుడికి విద్యార్థులు అందరూ వెళ్లారు. అందరితో పాటు విశ్వాస్ అనే యువకుడు వెళ్లాడు. అందరూ గుడిలో దేవుణ్ణి దర్శించుకుని సంతోషంగా ఎంజాయ్ చేశారు.

అయితే గుడిలో ఉన్న కొలనులో స్నానం చేద్దామని అందరూ దిగారు. అందరూ ఈతకొడుతూ స్నానం చేస్తున్నారు. విశ్వాస్ కు ఈత రాకపోవడంతో మునిగిపోతూ ఉన్నాడు. కానీ మిగతా విద్యార్థులు మునిగిపోతున్న స్నేహితున్ని గమనించకుండా సెల్ఫీలలో మునిగిపోయారు. కొద్దిసేపటికి 15 ఫీట్ల లోతున్న కొలనులో విశ్వాస్ మునిగిపోయాడు.

ఆ తర్వాత స్నేహితుడికోసం మూడు గంటలు అందరూ వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో ఆ తర్వాత పోలీసులు, గ్రామస్థులు వెతకగా విశ్వాస్ కొలనులో శవమై కనిపించాడు. సెల్ఫీ పిచ్చి తమ స్నేహితుడిని పొట్టన పెట్టుకుందని విద్యార్థులందరూ ఆవేదన వ్యక్తం చేశారు.