సెల్ఫీ ఇంతదూరం నుంచి తీసుకుంటే సూపర్ - MicTv.in - Telugu News
mictv telugu

 సెల్ఫీ ఇంతదూరం నుంచి తీసుకుంటే సూపర్

March 3, 2018

ఇప్పుడంతా సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. ఒకరు తీస్తే ఫోటోలు దిగే రోజులు పోయి ఎవరికి వారు సెల్ఫీలు దిగే స్థాయికి టెక్నాలజీ ఎదిగింది. స్మార్ట్‌ఫోన్ పుణ్మామా అని ఫోటోగ్రాఫర్లకు కాస్త పని తగ్గింది. అయితే సెల్ఫీలను పర్‌ఫెక్ట్‌గా తీయడం ఒక కళ.

సెల్ఫీ దగ్గరి నుంచి తీసుకుంటే ముఖం కాస్త పెద్దదిగా కనిపించడం.. ముక్కు సాగిపోయినట్లు ఉండటం… ఎక్కువసార్లు సెల్ఫీలు దిగటంవల్ల చర్మం ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి, సెల్ఫీలు దిగే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సెల్ఫీలు మరింత అందంగా వస్తాయంటున్నారు అమెరికా డాక్టర్  పష్కోవర్.వారు సాంకేతిక పద్ధతుల ద్వారా లోతుగా  పరిశోధన చేసి అనేక విషయాలను వెల్లడించారు.సెల్ఫీ కచ్చితమైన కొలతలతో రావాలంటే కెమెరాకు, ముఖానికి మధ్య దూరం 5 అడుగులు (1.5 మీటర్లు) ఉండాలట. 12 అంగుళాల దూరంలో సెల్ఫీ దిగితే ఫొటోలో ముక్కు పరిమాణం దాదాపు 30 శాతం పెరిగినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన కథనం ‘ జామా ఫేషియల్‌ ప్లాస్టిక్‌ సర్జరీ ’ జర్నల్‌లో ప్రచురితమైంది. న్యూజెర్సీ మెడికల్‌ స్కూల్‌, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన తన సహోద్యోగులతో కలిసి పష్కోవర్‌ ఈ పరిశోధన చేశారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వచ్చే పేషెంట్లు నా ముక్కు చాలా పెద్దగా అయిందని సెల్ఫీలు చూపిస్తూ బాధపడుతున్నారని ఆయన ఈ ప్రయోగం చేసినట్టు పష్కోవర్ తెలిపారు.అధ్యయనం చేసి సెల్ఫీ దిగడానికి కావాల్సిన దూరాన్ని 5 అడుగులుగా నిర్ధారించారు. దీనివల్ల సెల్ఫీతో వచ్చే చర్మ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయని పష్కోవర్‌ తెలిపారు.