వారెవ్వా.. మెట్రోల్లో  తొలిరోజు 45 వేల సెల్ఫీలు - MicTv.in - Telugu News
mictv telugu

వారెవ్వా.. మెట్రోల్లో  తొలిరోజు 45 వేల సెల్ఫీలు

December 1, 2017

మెట్రో ఎక్కు, సెల్ఫీ కొట్టు ఇదే నడిశింది మొదటిరోజు మెట్రో స్టేషన్లలో. చాలా మంది తొలిరోజు సెల్ఫీలకోసమే మెట్రో ఎక్కినట్టున్నరు. అందుకే ఒకటి కాదు , రెండు కాదు 45 వేల సెల్ఫీలు దిగిన్రు మెట్రో స్టేషన్లల్ల, మెట్రో రైళ్లల్ల.ఒక్క మియాపూర్  మెట్రో స్టేషన్లనే 25 వేల సెల్ఫీలు దిగిన్రట. మెట్రో స్టేషన్లల్ల ఉన్న సిసి కెమెరాల ద్వారా తెలిసిందీ ముచ్చట. మరి స్మార్ట్ కార్డులున్నోల్లు జర పైలం . సెల్ఫీల మోజులో పడి  తీరంగ మెట్రో స్టేషన్లల్ల కూర్చుంటిరంటే  మీ కార్డులున్న పైసలు గోవిందా..ఇగ ఇంకో నెలరోజుల్లో 24 మెట్రో స్టేషన్లలో  వాహనాలకు పార్కింగ్ వసతి కల్పిస్తామని చెబుతున్నారు అధికారులు.