మెసేజ్ పంపితే చాలు… పేరు, పోలింగ్‌ కేంద్రం, చిరునామా…

ఇప్పుడంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. సర్వ సమాచారం అంతా స్మార్ట్ ఫోన్లలోనే అయిపోయింది.. ప్రతీది అప్‌డేట్ అవుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో ఎన్నికల సీజన్ ఓటర్ లిస్టు కూడా ఆన్‌లైన్లో నిక్షిప్తమైంది. ఓటరు జాబితాలో మన పేరు వుందా.. ఉంటే ఏ పోలింగ్ బూతులో ఓటు వెయ్యాలి.. అనే సందిగ్ధం ఇక అవసరం లేదంటోంది ఎన్నికల కమిషన్. ఎందుకంటే చేతిలో ఫోన్ వుంది కదా. ఓటర్ల సౌకర్యార్థం స్మార్ట్ వెసలుబాటుకు బాటవేసిన ఈసీ.. ఫోన్ నుంచి చకచకా ఒక ఎస్ఎమ్ఎస్ పంపితే చాలంటోంది.Telugu news Send Message ... Name, Polling Center, Address …మీ పేరు ఓటర్ లిస్టులో వుందా లేదా, పోలింగ్‌కేంద్రం వివరాలన్నీ తెలుస్తాయి. ఓటరు తన సెల్‌ఫోన్‌ నుంచి 92251–66166, 92251–51969 నంబర్లకు టీఎస్‌ ఓటరు ఐడీ నంబర్‌ పంపితే చాలు. పేరు, పోలింగ్‌ కేంద్రం, చిరునామా సమాచారం వచ్చేస్తుంది. TS VOTE ఓటరు ఐడీ నంబర్‌ పంపిస్తే వివరాలు తెలుస్తాయి.