నటుడు చంద్రమౌళి కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

నటుడు చంద్రమౌళి కన్నుమూత

April 5, 2018

కూలీగా, తండ్రిగా, పక్కింటి వాడిగా, కంపెనీలో పనిచేసే కార్మికుడిగా, డ్రైవర్‌గా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాల్లో పోషించిన పాత్రలు చాలా వున్నాయి. ఎన్నో పాత్రలు పోషించి నటుడిగా ఇక సెలవంటూ కన్ను మూశారు ప్రముఖ నటుడు చంద్రమౌళి. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమౌళి ఇవాళ ఉదయం 7 గంటలకు హైదరాబాద్ హైటెక్ సిటీలో స్వగృహంలో కన్ను మూశారు.పార్థr దేహాన్ని ఆయన స్వస్థలం తిరుపతికి తీసుకువెళుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమాలు తప్ప వేరే ప్రపంచం తెలియని ఆయన మరణం తీరని లోటే. పాత్ర చిన్నదా, పెద్దదా అనే పట్టింపులు లేకుండా ఆయన పోషించిన పాత్రలు కోకొల్లలు. కానీ నటుడిగా ఆయనకు అందరికీ రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు.