ఎన్టీఆర్ భార్యగా విద్యాబాలన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్ భార్యగా విద్యాబాలన్

March 13, 2018

ప్రఖ్యాత నటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తుండటమే కాకుండా నిర్మాతగానూ  వ్యవహరిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రను చిత్ర యూనిట్ తాజాగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ను దీని కోసం సంప్రదించారు.ఎన్టీఆర్ యువకుడి పాత్ర కోసం శర్వానంద్‌ను ఎంపిన చేసినట్టు  తెలుస్తోంది. అయితే ఈ రెండు పాత్రలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. సంక్రాంతి కానుకగా 2019 జనవరిలో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.