‘ఒక్కడు మిగిలాడు’ ను నిలిపివేసిన సెన్సార్..! - MicTv.in - Telugu News
mictv telugu

‘ఒక్కడు మిగిలాడు’ ను నిలిపివేసిన సెన్సార్..!

September 14, 2017

సెప్టెంబర్ 22 న నాలుగు భాషల్లో విడుదలవుతున్న ‘ ఒక్కడు మిగిలాడు ’ సినిమా ఆగిపోయిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎందుకు ఆగిపోయిందంటే.. సెన్సార్ వాళ్ళే ఆపారనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానిజాలు తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఎల్ టిటిఇ ( లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్ ) ప్రభాకరన్ అనే తమిళ విప్లవ వీరుడి కథగా ఈ సినిమా తెరకెక్కింది. అప్పట్లో శ్రీలంక మీద వార్ చేసిన ప్రభాకరన్ మూమెంట్స్ ని స్క్రీన్ మీద చూపించే ప్రయత్నమే ఈ సినిమా. మంచు మనోజ్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఎందుకు ఈ సినిమా మీద సెన్సార్ బోర్డు వేటు విధించిందనే ప్రశ్నకు సమాధానంగా.. క్రింది అంశాలను వెలువరించింది సెన్సార్. శ్రీలంక ఇప్పుడు మిత్రదేశం దానికి వ్యతిరేకంగా ఈ సినిమా అవసరమా ?

శ్రీలంకతో సద్దుమణిగిన వివాదాన్ని ఇప్పుడు సినిమాగా చూడటం ఎందుకు ? అనే ప్రశ్నలు వినబడుతన్నాయి. చూడాలి మరి ఈ సెన్సార్ వివాదాన్ని దాటి ఈ సినిమా విడుదలకు నోచుకుంటుందో లేదో.

మంచు మనోజ్ కూడా ఈ సినిమా మీద చాలా ఎఫర్ట్ పెట్టి చేసాడు. తన గత సినిమాల కన్నా భిన్నమైన సినిమా అని కూడా తన ఆనందాన్ని షేర్ చేస్కున్నాడు. మంచి కథా బలమున్న బయోపిక్ సినిమానే. కానీ ప్రస్తుత స్థితిగతులకు పొసగటం లేదని సెన్సార్ వాళ్ళు నిలిపేవేయటం చిత్ర యూనిట్ కి కొరకరాని కొయ్యగా మారింది ?