సెరీనాకు ఆడపిల్ల... - MicTv.in - Telugu News
mictv telugu

సెరీనాకు ఆడపిల్ల…

September 2, 2017

ప్రఖ్యాత టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ తల్లి అయ్యింది. శుక్రవారం రాత్రి సెరీనాకు, ఆమెకు కాబోయే భర్త అలెక్సిన్ ఒహనియన్ లకు పడ్డంటి ఆడపిల్ల జన్మించింది.  ఈ విషయాన్ని సెరీనా సోదరి, టెన్నిస్ క్రీడాకారిణి  వీనస్ విలియమ్స్ తెలిపింది,   తనకు చాలా సంతోషంగా ఉంది అని వీనస్ చెప్పిది.  ప్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో ఉన్న సెయింట్ మేరీస్ మెడికల్ సెంచర్ లో సెరీనా పాపకు జన్మనించింది. ఈ పాప 3 కిలోల బరువు ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. పలువురు సెలబ్రెటిలు సెరీనాకు కంగ్రాట్స్ తెలిపారు.

సెరీనా ఏప్రిల్ లోనే తాను గర్భం దాల్చిన విషయాన్ని స్నాప్ చాట్ ద్వారా తెలిపింది. దానికి 20 వారాలు అని క్యాప్షన్ అని కూడా పెట్టింది.  బాయ్ ఫ్రెండ్  అలెక్సిన్ ఒహనియన్ తో తనకు ఉన్న బంధాన్ని గురించి తెలిపింది. అయితే బేబీకి జన్మనిచ్చిన తర్వాత కూడా తాను టెన్నిస్ ఆడుతానని చెప్పింది. అదే విషయాన్ని ఆమె కోచ్ ప్యాట్రిక్ కూడా తెలిపాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలువడమే సెరీనా లక్ష్యమని పేర్కొన్నాడు. ఒకవేళ ఆమె సిద్దంగా ఉంటే, పోటీపడుతుంది, లేదంటే ఆలస్యంగానైనా మళ్లీ ఎంట్రీ ఇస్తుందని కోచ్  తెలిపారు.