మీ టీవీ సెట్‌టాప్ బాక్సుల్లో సర్కారు చిప్.. - MicTv.in - Telugu News
mictv telugu

మీ టీవీ సెట్‌టాప్ బాక్సుల్లో సర్కారు చిప్..

April 16, 2018

ఆధార్, బయోమెట్రిక్ వంటి వాటితో ప్రజల పూర్తి వివరాలు తెలుసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పద యత్నానికి తెరతీసింది. టీవీ సెట్‌టాప్ బాక్సుల్లో చిప్‌లను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదిస్తోంది. ప్రజలు ఎక్కువగా ఏ చానల్ చూస్తున్నారు? ఏ చానల్‌ను ఎంత సేపు చూస్తున్నారు? వారికి ఏవంటే ఇష్టం, వారి అభిరుచులేంటి? ఏ చానల్‌కు ప్రకటనలిస్తే జనం చూస్తారు?  వంటి వివరాలను తెలుసుకోవడానికి చిప్ సాయం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

టీవీ చానళ్లు టీఆర్పీ రేటింగుల కోసం అక్రమాకు పాల్పడుతున్నాయని, వాస్తవ సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడానికి సెట్ టాప్ బాక్సుల్లో చిప్‌లు పెట్టాలనుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. తద్వారా ప్రభుత్వ ప్రకటనలను ఏ చానల్‌కు ఇస్తే ప్రయోజనం ఉంటుందో తెలుసుకోవచ్చని, నిధుల దుర్వినియోగం తగ్గుతుందని అంటున్నారు. అయితే ఇది ప్రజల వ్యక్తిగత జీవితాలపై నిఘా పెట్టడమేని కొందరు ఆపరేటర్లు మండిపడుతున్నారు.