mictv telugu

సికింద్రాబాద్‌లో సెట్విన్ బస్సు బీభత్సం..

January 28, 2019

సికింద్రాబాద్‌లో సెట్విన్ బస్సు బీభత్సం సృష్టించింది. అంతవరకు ప్రయాణికులు బస్సుల కోసం బస్టాప్‌లో వేచివున్నారు. ఇంతలో సెట్విన్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి అక్కడున్న ఆటోను ఢీకొట్టి, అదుపుకాక వేగంగా షాపులోకి దూసుకెళ్లింది. ఊహించని పరిణామంతో ప్రయాణికులంతా హాహాకారాలు చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ మద్యం తాగి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు స్థానికులు చెప్పారు.Telugu news Setwin bus was hit in Secunderabad