సెక్స్ బొమ్మలతో వ్యభిచారం - MicTv.in - Telugu News
mictv telugu

సెక్స్ బొమ్మలతో వ్యభిచారం

February 15, 2018

‘శృంగారం’  ప్రతి మనిషి జీవితంలో ఇదోక  భాగం.  మారుతున్న కాలంతో  పాటు  శృంగారం కూడా  ఓ వ్యాపారంగా మారింది.  కొన్ని దేశాల్లో శృంగారం చట్టబద్ధం కూడా. అయితే  శృంగారం మనుష్యులతోనే ఎందుకు..ఎటువంటి సుఖవ్యాధులు సోకకుండా  హాయిగా  బొమ్మలతో శృంగారం చేయండి అని కొందరు ఈమధ్య కాలంలో  కొత్త బిజెనెస్ మొదలు పెట్టారు. వాటికి డిమాండ్ కూడా బాగానే ఉంది.   స్కాట్లాండ్ కు చెందిన  ఓ వ్యక్తి ‘డేట్ ఎ డాల్ సర్వీసెస్ లిమిటెడ్’ పేరుతో సెక్స్ బొమ్మలతో  వేశ్య గృహాన్ని  ప్రారంభించాడు. గంటకు 70 పౌండ్లు చెల్లించి గంటసేపు సెక్స్ బొమ్మతో శృంగారం చెయ్యచ్చు అని ఆఫర్ పెట్టాడు. అంతే  అతని బిజినెస్ ఒక్కరోజులోనే  బాగానే  పుంజుకుంది. అయితే ఈక్రమంలో  చుట్టుపక్కల వారు  గోల చేశారు.  ఫ్యామీలీలు ఉండే చోట ఇదేం బిజినెస్ అని కోప్పడడంతో  అతడు  ఆ బ్రోతల్ హౌస్‌ను మూయక తప్పలేదు.అప్పుడే అతనికి ఇంకో ఆలోచన వచ్చింది.  బ్రోతల్ హౌస్ నడిపితే ఎక్కడైనా ఇదే గోల దానికి బదులుగా  సెక్స్ బొమ్మలను అద్దెకు ఇస్తే  మంచిది అనుకున్నాడు. గంటల చొప్పున సెక్స్ బొమ్మలను అద్దెకివ్వడం మొదలు పెట్టాడు.  సెక్స్ బొమ్మను తీసుకెళ్లేవాళ్లు కొంత ఎక్కువ డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అతని వ్యాపారం  శృంగార ప్రియుల పుణ్యాన బాగానే ఉందట.  రోబోలతో  బ్రోతల్ హౌస్ నిర్వహించడమే  తన లక్ష్యమని  అతను చెబుతున్నాడు.