4వతరగతి విద్యార్ధినిపై  లైంగిక దాడి - MicTv.in - Telugu News
mictv telugu

4వతరగతి విద్యార్ధినిపై  లైంగిక దాడి

November 2, 2017

ఆబిడ్స్ సుజాత హైస్కూల్‌లో నీచమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై వాచ్‌మెన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈవిషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులతో చెప్పింది. దీనితో విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

స్కూల్ యాజమాన్యం ఎవరు పట్టించుకోకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘గత కొన్ని రోజుల నుంచి వాచ్‌మేన్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని’ విద్యార్థిని పోలీసులకు చెప్పింది. బాలిక వాగ్మూలం ప్రకారం పోలీసులు వాచ్‌మేన్‌పై కేసును నమోదు చేసారు. పరారీలో ఉన్న వాచ్‌మేన్‌కోసం పోలీసులు గాలిస్తున్నారు.