వ్యభిచారం చేసిన ఆ బడాబాబుల పేర్లు.. ఎందుకు బయట పెట్టరు? - MicTv.in - Telugu News
mictv telugu

వ్యభిచారం చేసిన ఆ బడాబాబుల పేర్లు.. ఎందుకు బయట పెట్టరు?

December 17, 2017

ఈరోజు ఏ న్యూస్ ఛానల్ చూసినా  ఒకటే వార్త  పలు హోటళ్లలో వ్యభిచారం చేస్తూ పట్టుపడ్డ హీరోయిన్లు, వారిని అరెస్ట్ చేసి పంజాగుట్ట స్టేషన్‌కు తరలింపు అని. ఇంకోటి కూడా చెబుతున్నారు. ఈ వ్యభిచారంలో పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నట్లు సమాచారం అని. మరి ఎవరా బడా బాబులు? వాన్ని ఎందుకు టీవీల్లో చూపెట్టరు? కనీసం వాడి పేరు కూడా ఎందుకు బయటకు రాదు? ఎందుకు ఎప్పుడు చూసినా వ్యభిచారం చేసిన ఆడవాళ్లను వీడియోలు తీస్తూ,ఫోటోలు కొడుతూ ప్రపంచానికి చూసిస్తారె తప్ప, మరి వారితో వ్యభిచారం చేసిన మగాడి రూపు రేఖలు కాదు కదా…కనీసం వాడి పేరుకూడా బయటకు రాదు.. ఎందుకు? అంటే వాడేదో ఘనకార్యం చేశాడా? వాడు కూడా వ్యభిచారే కదా మరి వాళ్ల పేర్లు ఎందుకు బయట పెట్టరు? ఇంతవరకు వ్యభిచారంలో దొరికిన ఏ కేసులోనైనా చూడండి.

కేవలం  నటీమణులు పేర్లు వారి పుట్టు పూర్వోత్తరాలతో సహా బయటపెడుతూ ఇరవై నాలుగంటు బ్రేకింగ్ వేస్తారు.. కానీ మరి వాళ్లతో వ్యభిచారం చేసిన ఆ బడా బాబుల పేర్లు మాత్రం బయటకు రావు ఎందుకు? ఆడవాళ్లంటే అంత చులకనా? ఇద్దరూ తప్పు చేసినపుడు ఇద్దరి పేర్లు బయట పెట్టాలి కదా? మరి ఒక్క ఆడదాని పేరే బయటపెడుతూ వారినే అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు? కేవలం ఆడదే వ్యభిచారం చేస్తుందా ? ఆ మగాడు చెయ్యడం లేదా? వాడేమన్నా సత్తె పూసా? వాడిపై కూడా కేసు నమోదు చేసి రెస్కూ హోంకు  పంపియ్యాలెగదా ? ఆడవాళ్లను మాత్రమే బద్నాం చెయ్యడం ఎంతవరకు సమంజసం. వారు చేసింది తప్పే… కానీ ఆతప్పులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడితేనే సమన్యాయం అన్న దానికి అర్థం ఉంటుంది.

దీనికి ఒక్కటే మార్గం వ్యభిచారం చేస్తున్న బడాబాబులు పేర్లు ఎలాగో బయటకు రావు. కానీ వ్యభిచారంలో పట్టుబడ్డ అక్కలు, చెల్లెళ్లు మీతో వ్యభిచారంలో పాల్గొన్న ఆ బడాబాబులు ఎవరో మీరే మీడియా ముందు బయట పెట్టండి. అప్పడు తప్పు చేసింది కేవలం ఆడదే కాదు ఆతప్పులో సమంగా మగాడి పాత్ర కూడా ఉందని ఈ ప్రపంచానికి తెలుస్తుంది. లేకపోతే పట్టుబడిన మీపరువు పోయి, మీరు రెస్కూహోంకు పోతుంటారు. కానీ మీతో పాటు వ్యభిచారంలో పాల్గొన్న ఆ బడాబాబులు మీలాంటి ఎందరినో ఇలా డబ్బులకు ఆశ చూపి వ్యభిచార రొంపిలో దింపి.. వారు మాత్రం బయటపడకుండా సమాజంలో పెద్ద మనుషుల్లా చలామని అవుతూనే ఉంటారు. అందుకే వ్యభిచారంలో కేవలం ఆడదాని తప్పు మాత్రమే కాదు, మగాడి తప్పుకూడా ఉందని బయటపెట్టండి. వ్యభిచారం అనే ఈ రొంపిలో మరో ఆడపిల్ల మీలా బలికాకుండా కాపాడండి.