మైనర్ భార్యతో శృంగారం నేరమే

మైనర్లతో వివాహంపై సుప్రీంకోర్డు సంచలన తీర్పు చెప్పింది. 18 ఏళ్ల యవసులోపు ఉన్న మైనర్ భార్యతో  కాపురం చేస్తే అత్యాచారమే అవుతుందని  కోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి 18ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికతో లైంగిక చర్యలో పాల్గొనడం నేరం.  ఇందులో బాలిక అంగీకారం ఉన్నా లేకపోయినా దీన్ని నేరంగానే పరిగణిస్తారు.  అయితే సదరు బాలిక అతడి భార్య అయి ఉండి.. ఆమె వయసు 15ఏళ్లు మించితే ఈ చట్టం నుంచి గతంలో కోర్టు  మినహాయింపు కల్పించింది.  అయితే దీన్ని సవాల్ చేస్తూ ఓ ఎన్జీవో సంస్థ  సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. వివాహితులైన మైనర్లతో లైంగిక చర్య ఎంత మాత్రం సరైనది కాదని పిటిషన్‌లో పేర్కొంది.  బాల్యవివాహమే చట్ట వ్యతిరేకం అయినప్పుడు 15ఏళ్ల నుంచి 18ఏళ్ల బాలికలపై కాపురం పేరుతో లైంగికచర్యకు పాల్పడటం చట్టమెలా అవుతుందని ప్రశ్నించింది.  దీనితో సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

SHARE