లైంగిక వేధింపుల కేసులో డీఎస్ కుమారుడు అరెస్ట్.. - MicTv.in - Telugu News
mictv telugu

లైంగిక వేధింపుల కేసులో డీఎస్ కుమారుడు అరెస్ట్..

August 12, 2018

లైంగిక వేధింపుల కేసులో టీఆర్‌ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోపణలు వచ్చినప్పటి నుంచి కనిపించకుండా పోయిన సంజయ్.. ఈ రోజు లాయర్ కృపాకర్‌రెడ్డితో కలిసి నిజమాబాద్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించి, రిమాండ్‌కు తరలించారు.  శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినిలు సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ లేని సమయంలో తన గదిలోకి పిలిపించుకొని వేధిస్తున్నాడని పేర్కొన్నారు.

Trs mp son arrested for sexual harassment

స్పందించిన హోంమంత్రి నాయిని దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న సంజయ్ అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు.. అయితే మూడు రోజుల క్రితం తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని హైకోర్టలో క్యాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను విచారణ జరిపి కోర్టు కొట్టేసింది. సీఆర్ పీసీ 41/A సెక్షన్ ప్రకారం వ్యవహరించాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. ఈ మేరకు సంజయ్‌పై కేసు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణకు వచ్చిన సంజయ్‌ను అరెస్ట్ చేశారు.