రూ. 73 కోట్ల షారూక్ బినామీ ఆస్తులు అటాచ్ - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 73 కోట్ల షారూక్ బినామీ ఆస్తులు అటాచ్

January 31, 2018

‘హీరోగారు రైతుగా మారి వ్యవసాయం చేస్తానని భూమి కొన్నాడు.. అయితే పక్కాకా వ్యూహం మార్చి విలాసాలకు వాడుతూ వ్యాపారం చేస్తున్నాడు..’ అంటూ ఐటీ శాఖ బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్‌ ఫామ్‌హౌజ్‌ను అటాచ్ చేసింది.బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద డెజావూ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అలీబాగ్‌లో వున్న షారూక్ ఫామ్‌హౌజ్‌ను జప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. వ్యవసాయం కోసం కొన్నేళ్ళ క్రితం డెజావు ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 19,960 చదరపు మీటర్ల స్థలాన్ని షారూక్ కొనుగోలు చేశాడు. కానీ ఆ స్థలంలో వ్యవసాయం చేయకుండా ఫామ్‌హౌజ్ కట్టి తన విలాసాలకు వాడుకుంటున్నట్టు ఆదాయపు పన్ను శాఖ ఆరోపిస్తోంది. గతంలో ఇచ్చిన నోటీసులపై షారూక్ స్పందించకపోవడంతోనే ఈ చర్య తీసుకుంటున్నట్టు తెలిపారు. రూ. 14.6 కోట్ల విలువున్న ఈ ఆస్తి మార్కెట్ విలువ దీనికి 5 రెట్లు (రూ. 73) ఎక్కువ వుంటుందని పేర్కొన్నారు.