లేనోడు లేక ఏడిస్తే ఉన్నోడు తిన్నది అర్గక ఏడ్సిండట అగో అట్లనే ఉంటయ్ కొందరు డబ్బున్న మారాజుల పనులు గుడ. కోట్లు కూడ వెట్టినా ఇంకా ఇంకా అంటూ డబ్బుమీద ఆశ మాత్రం సావది. దానికోసం అడ్డదారులు తొక్కడానికి కూడా వెనకాడరు. బాలీవుడ్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న షారూఖ్ కూడా అలాంటిదే ఓ పని చేశాడు. ముంబైలోని అలీబాగ్‌లో ఉన్న 20,000 గజాల స్థలాన్ని గతంలో నకిలీ పత్రాలతో కొనుగోలు చేశాడు. మార్కెట్ విలువ ప్రకారం 75 కోట్లు ఉన్న స్థలాన్ని షారూక్ నకిలీ పత్రాలతో 15 కోట్లకే కొన్నాడట.ఆ తర్వాత ఆ స్థలంలో బీచ్, స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ హెలీప్యాడ్ తదితర సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టాడు. షారూఖ్ చేసిన మోసాన్ని గమనించిన ఐటీ శాఖ అతనికి నోటీసులు పంపించింది. ఈవిషయంపై షారూఖ్ చార్టెడ్ అకౌంటెంట్‌ను విచారించగా నకిలీ పత్రాలతో షారూఖ్ ఆ స్థలాన్ని కొన్నట్లు అంగీకరించాడు. దీనితో షారుఖ్ చిక్కుల్లో పడ్డాడని తెలుస్తోంది. ఒకవేళ కోర్టులో షారూఖ్ చేసిన మోసం రుజువైతే అతనికి ఆరు నెలల నుంచి ఏడేళ్ల జైలు శిక్ష మరియు ఆస్తుల్లో 10 శాతం జరిమానా పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.