షారుక్ కొడుకుకు అమితాబ్ ఏమవుతాడు? - MicTv.in - Telugu News
mictv telugu

షారుక్ కొడుకుకు అమితాబ్ ఏమవుతాడు?

November 20, 2017

అమితాబ్, షారుక్ ఖాన్‌ల కోల ముఖాలు చూసి షారూక్  చిన్న కొడుకు అబ్రామ్ అమితాబ్‌ను తాత అనుకుంటున్నాడు.  టీవీలో అమితాబ్‌ను ఎప్పుడు చూసినా నాన్నకు నాన్న అనుకుంటాడట. ఇటీవల అభిషేక్, ఐశ్వర్యల కుమార్తె ఆరాధ్య పుట్టినరోజు వేడుకకు అబ్రామ్‌ను తీసుకొని వెళ్ళాడు షారూక్. అక్కడ అబ్రామ్ అమితాబ్‌ను పీచు మిఠాయి కావాలని అడిగాడు.  వెంటనే అమితాబ్ అబ్రామ్‌ను తీసుకు వెళ్ళి స్టాల్ దగ్గర మిఠాయి ఇప్పిస్తూ ఆ ఫోటోను అమితాబే ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.అందుకు కృతజ్ఞతలు చెప్తూ షారూక్ ఖాన్ రీట్వీట్ చేశాడు. ‘ ధన్యవాదాలు సర్.. ఇది వాడి జీవితంలో చెప్పుకోదగ్గ క్షణం. వాడు మిమ్మల్ని టీవీలో చూసినప్పుడల్లా నా తండ్రే అనుకుంటాడు ’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు షారూక్.