శైలజా రెడ్డి అల్లుడిగా నాగచైతన్య - MicTv.in - Telugu News
mictv telugu

శైలజా రెడ్డి అల్లుడిగా నాగచైతన్య

October 28, 2017

ఇన్నిరోజులు లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా నటించిన నాగచైతన్య కొత్తగా అల్లుడి పాత్రలో నటిస్తున్నాడు. అదీ రమ్యకృష్ణకు అల్లుడిగా చేస్తున్నాడు. శైలజా రెడ్డి పాత్రలో రమ్యకృష్ణ మెరవనున్నది. సినిమా పేరు కూడా ‘ శైలజా రెడ్డి అల్లుడు ’ అవడం విశేషం. మారుతి దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానరుపై రూపొందుతున్న ఈ సినిమాలో కథానాయిక ఎవరన్నది త్వరలో చిత్ర యూనిట్ వెళ్ళడించనున్నది.