బిజీ అయిన  ‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్..!

‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్ శాలిని పాండేకు వరస అవకాశాలు క్యూ కట్టుతున్నాయి. విజయ్ దేవరకొండతో ఆమె నటించిన ‘అర్జున్‌రెడ్డి’  చిత్రం విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ సినిమాలో శాలిని(ప్రీతి)  నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రం తర్వాత ఆమెకు‘ మహానటి’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దాంతోపాటు 100% లవ్ తమిళ రీమేక్‌లో తమన్నా పాత్రలో నటించేందుకు సంతకం  చేసింది. తాజాగా ఆమెకు మరో అవకాశం వెతుక్కుంటూ వచ్చిందని సినీ వర్గాల సమాచారం. ఓకే బంగారం ఫేం దుల్కర్ సల్మాన్ హీరోగా  తెలుగు,తమిళ భాషల్లో ఓ సినిమా తెరక్కనుంది. ఆ సినిమాకు టైటిల్ ఇంకా  ఖరారు కాలేదు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం దర్శక, నిర్మాతలు శాలినిని సంప్రదింపులు జరిపినట్టు  తెలుస్తోంది. ఇంకా అధికారకంగా  ప్రకటన చేయలేదు.ఈ చిత్రంలో ముగ్గురు కథానాయకలకు చోటుందట. ఓ రోడ్డు ట్రిప్ చూట్టూ కథ సాగనున్నట్టు సమాచారం.

SHARE