సింగర్ అవతారమెత్తిన ‘ అర్జున్ రెడ్డి ’ భామ - MicTv.in - Telugu News
mictv telugu

సింగర్ అవతారమెత్తిన ‘ అర్జున్ రెడ్డి ’ భామ

February 12, 2018

‘ అర్జున్ రెడ్డి ’ సినిమాలో ప్రీతి పాత్రలో నటించి యువతను బాగా ఆకట్టుకున్న భామ శాలిని పాండే. తన సహజ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అప్పటివరకు స్టేజ్ షోలు చేసుకుంటున్న షాలినీ అర్జున్ రెడ్డి సినిమాతో బిజీ హీరోయిన్ అయిపోయింది. కాగా షాలినీ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించటానికి సిద్ధమవుతోంది. గాయనిగా తొలిసారి తన గళాన్ని విప్పింది.

ప్రేమికుల రోజు సందర్బంగా ‘ నా ప్రాణమే ’ అంటూ ఓ పాటను ఆలపించింది. పాప్ రాక్ బ్యాండ్      ‘ లగోరీ ’ స్వర పరిచిన  పాటను అద్బుతంగా పాడింది. ఈ పాటకు సంబంధించిన చిన్న టీజర్‌ను విడుదల చేశారు. షాలిని చాలా కాన్ఫిడెంట్‌తో పాటను పాడింది. ఆ పాటకు తగ్గట్టే సంగీతం కూడా ఆకట్టుకుంది. ఈ పాట ఫిబ్రవరి 14న  ప్రేమికుల రోజున విడుదల చేయనున్నారు.చూస్తుంటే సింగర్‌గా కూడా ఆమె సక్సెస్ అవుతుందనే అనిపిస్తోంది. ఇక ఆమె ‘ మహానటి ’ సినిమాతో పాటుగా కోలీవుడ్‌లో ‘ 100% ’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.