శంషాబాద్‌లో 4 కేజీల దొంగ బంగారం - MicTv.in - Telugu News
mictv telugu

శంషాబాద్‌లో 4 కేజీల దొంగ బంగారం

October 9, 2018

ఉద్యోగులే అవినీతికి పాల్పడితే సామాన్య జనాలు ఎవర్ని నమ్మాలి ? శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇప్పటికి చాలాసార్లు దొంగ బంగారం పట్టుబడింది. అయితే ఆ బంగారాన్ని తీసుకువచ్చింది వేరేవాళ్ళు. కానీ ఈసారి ఎయిరిండియా శాట్స్ ఉద్యోగే దొంగబంగారాన్ని తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. రూ.1.34 కోట్ల విలువైన, 4.194 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. ఇంకా అతనివద్ద 3.6 లక్షల దేశీయ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, హైదరాబాద్ జోనల్ యూనిట్(డీఆర్ హెచ్జీయూ) అధికారులు సీజ్ చేశారు. మంగళవారం ఉదయం సంఘటన జరిగింది.

4 kg gold thief in Shamshabad

ఎయిర్‌పోర్టు బయట వీటిని పట్టుకెళ్తున్న ఎయిరిండియా ఉద్యోగి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఉద్యోగితో పాటు, బంగారాన్ని తీసుకోవడానికి వచ్చిన మరో ఇద్దరిని కూడా డీఆర్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత బంగారం అతనికి ఎక్కడినుంచి వచ్చింది ? ఉద్యోగి ఎప్పటినుంచి ఈపని చేస్తున్నాడు ? ఈ బంగారాన్ని ఎక్కడికి చేరవేస్తున్నారనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.