శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అరుదైన అవార్డు - MicTv.in - Telugu News
mictv telugu

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అరుదైన అవార్డు

February 14, 2018

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో అరుదైన అవార్డు  వచ్చింది. కార్పొరేట్  సామాజిక సేవారంగంలో  ఉత్తమ సేవలు అందించినందుకు గాను ‘గోల్డెన్ పీకాక్’ అవార్డు వరించింది. బెంగళూరులో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో  మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా వెంకటాచలయ్య చేతుల మీదుగా జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మీనారఘునాథన్‌ ఈ అవార్డును అందుకున్నారు.

ఈ విషయాన్ని జీఎంఆర్‌ సంస్థ ప్రతినిధి ప్రశాంత్‌ తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్‌  మాట్లాడుతూ…‘గోల్డెన్‌ పీకాక్‌’ రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న సంగతి తెలిసిదే. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐఓడీ) సంస్థ ఈ అవార్డులు అందిస్తుంటుంది.