mictv telugu

సీఎం బాగా లావైంది, విశ్రాంతి ఇవ్వండి.. శరద్ యాదవ్

December 6, 2018

అశ్లీల వ్యాఖ్యలకు, కుళ్లు జోకులకు పెట్టింది పేరైన జేడీయూ బహిష్కృత నేత శరద్ యాదవ్ మళ్లీ నోరు చేసుకున్నారు. ఈసారి ఏకంగా ఒక మహిళా ముఖ్యమంత్రిపైనే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బాడీ షేమింగ్‌కు పాల్పడుతున్న యాదవ్‌ను చీపుర్లతో కొట్టాలని, ఆయనకు మహిళలపై గౌరవం లేదని, తనింట్లోని మహిళలను కూడా అలాగే అంటుంటారేమోని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘వసుంధర రాజే బాగా లావు అయ్యారు… మెకు కొంత విశ్రాంతి ఇవ్వండి.. ఆమె మధ్యప్రదేశ్‌ బిడ్డ. అలా లావుగా ఉండకూడదు, నాజూగ్గా ఉండాలి. కానీ బాగా లావయ్యారు.. అలిసిపోతున్నారు… ’ అని యాదవ్ రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్నారు.  ఆయన గతంలో ఓటును, కూతురును పోల్చి తిట్లు తిన్నారు. కూతురు దారి తప్పితే ఊరి పరువు పోతుందని, ఓటు దారి తప్పితే దేశం పరువు పోతుందని అన్నారు.