షేర్ మార్కెట్ దెబ్బ.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు.. - MicTv.in - Telugu News
mictv telugu

షేర్ మార్కెట్ దెబ్బ.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు..

November 9, 2018

షేర్ మార్కెట్ అంటే ఒక జూదంలాంటిది. జూదం ఆడినవారు ఎన్నెన్ని రకాలుగా నష్టపోయారో మనకు తెలిసిందే. ఆస్తులు కుదవబెట్టడంతోనే ఆగిపోలేదు… చివరికి కట్టుకున్న భార్యను కూడా తాకట్టుపెట్టిన సందర్భాలెన్నో. అది రానురాను తగ్గుముఖం పట్టిందనుకుంటే… అదిప్పుడు షేర్ మార్కెట్ రూపాన్ని ధరించిందేమో అనిపిస్తోంది. షేర్ మార్కెట్లో లాభాలు వస్తాయని చాలా మంది ఇందులోకి దిగి లక్షలు, కోట్లలో పెట్టుబడులు పెట్టి లాభాలు పడ్డవాళ్ళు వున్నారు. కానీ ఎప్పుడు లాభాలే వుండవు కదా. నష్టాలు కూడా వుంటాయి. కాకపోతే ఇందులో నష్టాలు చాలా తీవ్రంగా వుంటాయి. అలా ఇప్పుటికి షేర్ మార్కెట్ ధాటికి చాలామంది తమ ప్రాణాలు తీసేసుకున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లోనూ చోటు చేసుకుంది.Telugu news Share market blow .. Couple committed suicide ..He committed suicide at the railway station at Sanatnagar..షేర్ మార్కెట్‌లో నష్టం రావడంతో, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. దీంతో దంపతుల నడుమ వివాదాలు పెరిగాయి. ఈ క్రమంలో దంపతులు వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుంటూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన బత్తినేని శిరీష(27), బాపయ్య చౌదరి (31) దంపతులు. వీరికి ఒక పాప(3) కూడా వుంది. కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్-1 పరిధిలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. దంపతులిద్దరూ గచ్చిబౌలిలోని దివ లేబరేటరీస్‌లో పనిచేస్తున్నారు. ఇంకా ఏదైనా చేసి డబ్బులు ఎక్కువ సంపాదించాలని బాపయ్య చౌదరి షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాడు. అప్పులు చేసిమరీ పెట్టుబడులు పెట్టాడు.

షేర్ మార్కెట్ పడిపోయి లాభం రాకపోగా…ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో బాపయ్య తన పెండ్లి సమయంలో అత్తామామలు రాసిచ్చిన ఆస్తులను విక్రయించాడు. ఆ విషయం తెలిసి భార్య శిరీష, భర్తతో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష బుధవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మృతురాలి సోదరుడు ..బావకు విషయం చెప్పాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన బాపయ్య సైతం గురువారం ఉదయం సనత్‌నగర్ రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుమార్తె అనాథ అయింది.