యువ ఎన్టీఆర్ పాత్రలో శర్వానంద్ ? - MicTv.in - Telugu News
mictv telugu

యువ ఎన్టీఆర్ పాత్రలో శర్వానంద్ ?

March 6, 2018

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ‘ ఎన్టీఆర్ ’ బయోపిక్‌లో యువహీరో శర్వానంద్ నటిస్తున్నట్టు సమాచారం.

దివంగత నందమూరి తారక రామారావు జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ  చిత్రంలో శర్వానంద్ యువ ఎన్టీఆర్ పాత్రను పోషించనున్నట్లు టాలీవుడ్ సమాచారం.ఎన్‌బీకే స్టూడియోస్ పతాకంపై బాలయ్యే ఈ సినిమాను నిర్మించనుండటం విశేషం. ఇందులో ఎన్‌టీఆర్ జీవితంలోని మూడు దశలను చూపించనున్నారు. స్కూలు విద్యార్థిగా, టీనేజర్‌గా, 25 ఏళ్ల యువకుడిగా ఎన్టీఆర్ పాత్ర చిత్రణ వుంటుంది. యువ ఎన్టీఆర్ పాత్ర కోసం టాలీవుడ్‌లో కొంతమంది హీరోలను పరిశీలిస్తున్నారు. అందులో ఎక్కువగా శర్వానంద్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో మెరవనున్నారు.