మిస్ వరల్డ్‌పై థరూర్ చిల్లర ట్వీట్   - MicTv.in - Telugu News
mictv telugu

మిస్ వరల్డ్‌పై థరూర్ చిల్లర ట్వీట్  

November 20, 2017

కాంగ్రెస్ సినీయర్ నేత శశిథరూర్ చేసిన ట్వీట్ వివాదంగా మారింది. మిస్ వరల్డ్-2017గా ఎంపికైన భారతీయ సుందరి  మానుషి చిల్లర్‌పై  ఆయన వివాదాస్పద  పోస్టు చేశారు. బీజేపీని విమర్శించే క్రమంలో మానుషిని విమర్శించాడు. ‘నోట్ల రద్దు  నిర్ణయం తీసుకుని బీజేపీ పెద్ద తప్పు చేసింది. మన డబ్బులకు అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు ఉందో వారికి అర్థం కావట్లేదు. కావాలంటే చూడండి మన చిల్లర (మానుషి చిల్లర్)’  అని థరూర్ ట్వీట్  చేశాడు. నోట్ల రద్దు తర్వాత భారతీయుల వద్ద చిల్లర మాత్రమే మిగిలందనే అర్థంతో ఆయన ట్వీట్ చేశాడు.ఆయన వ్యాఖ్యలపై హరియాణా మహిళ , శిశు సంక్షేమ మంత్రి కవిత జైన్ తీవ్రంగా మండిపడ్డారు.  ‘ మానుషి హరియాణాకే కాదు, దేశానికే వన్నె తెచ్చిన మహిళ. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి  ఇలాంటి ప్రేలాపనలు చేయడం శశిథరూర్‌కి తగదు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. అంతేకాక చిల్లర్ తెగను అవమానించారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఆలోచలనలు ఉన్న  నేత ఉన్నారు.. ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శశిథరూర్ సిగ్గులేని వ్యాఖ్యలు చేశారని, తక్షణమే క్షమాపణ  చెప్పాలని హరియాణా ఆర్థిక మంత్రి  కెప్టెన్ అభిమన్యు డిమాండ్ చేశారు. ఈ వివాదం ముదరడంతో శశిథరూర్ వెనక్కి తగ్గి  మానుషిని పొగుడుతూ మరో ట్వీట్ చేశారు.