సినిమా హాల్లో గ్యాంగ్ రేప్..! - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా హాల్లో గ్యాంగ్ రేప్..!

December 6, 2017

అమ్మాయితో స్నేహం వాళ్ళ దృష్ఠిలో తమ కామ వాంఛలను తీర్చుకోవడమే. కానీ ఆ అమ్మాయికి మాత్రం వాళ్లతో తనకు స్నేహం తప్ప ఇంకేం లేదనుకున్నది. తనతో సఖ్యతగా వుంటున్న ఆ ఇద్దరు తనను కాటేసేవరకు వాళ్ల నిజస్వరూపాలను  తెలుసుకోలేకపోయింది. సినిమా కథలా అనిపించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. పదహారేళ్ళ వయసున్న ఆ యువతి ఫోన్ నెంబర్ తెలుసుకొన్నారు ఇద్దరు కిలాడీలు. మెల్లగా ఫోన్లు చేశారు. మాటా మాటా కలిపారు. ఆమెను బురిడీ కొట్టించారు. తామన్నా, తామిద్దరి స్నేహమన్నా ఆ యువతికి భరోసా కలిగేలా మసలుకున్నారు. దాదాపు రెండు నెలలు అందరూ చెలిమిని పంచుకున్నారు. మధ్యమధ్యలో కలుసుకునేవారు. చిన్న చిన్న కానుకలు ఇచ్చిపుచ్చుకునేవారు.

ఈ మంగళవారం కూడా కలిశారు. మవానా పట్టణంలో షాపింగ్ చేశారు. తనేం కావాలన్నా కొనిచ్చారు. తర్వాత సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నారు.  థియేటర్లోనే ఎవరూ లేని చోట కూర్చుని అమ్మాయిపైన అత్యాచారానికి పాల్పడ్డారు.  యువతి అరవకుండా ఆమె నోట్లో గుడ్డలు కుక్కారు. చేతులను కట్టేసి రాక్షసంగా ప్రవర్తించారు. అత్యాచారం చేసిన తరువాత యువతిని ముజఫర్‌నగర్‌ ప్రాంతంలో వదిలిపెట్టారు. యువతి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఇద్దరి మీద ఫిర్యాదు చేసింది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వాళ్లు ఉపయోగించిన బైక్‌ను స్వాధీనపరుచుకున్నట్టు పోలీసులు తెలిపారు.