నన్ను ఏళ్ళ తరబడి లైంగికంగా వేధించాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను ఏళ్ళ తరబడి లైంగికంగా వేధించాడు..

December 14, 2017

హాలీవుడ్ నిర్మాత వీన్‌స్టీన్ లైంగిక వేధింపులు ఒక్కక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా నటి సల్మా హయక్ తెర మీదకు వచ్చింది. అతని నీఛ రాసలీలల గురించి ఇప్పటికి 50 మంది నటీమణులు అతని బండారం బయట పెట్టారు.  సల్మా హయక్ కూడా ధైర్యంగా బయటకు వచ్చి అతని దుర్మార్గాన్ని ఎండగట్టింది. అతడో మానవ మృగమని, ఎందరో ఆడవాళ్ల జీవితాలతో చెలగాటమాడిన ఆ దుష్టుడిని కఠినంగా శిక్షించాలంటోంది.

ఒకటి కాదు రెండు కాదు ఏళ్ళ తరబడి తనను లైంగికంగా వేధించాడని చెప్పింది. అతడు చెప్పినట్టు వినకపోతే తన అశ్లీల వీడియోలు, ఫోటోలు అప్‌లోడ్ చేస్తానని చాలా సార్లు బెదిరించినట్టు తెలిపింది. తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా బయట పెట్టి ఇలాంటి మానవ మృగాల ఆట కట్టించాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం చాలా మందిలో మార్పు వచ్చింది. అలాగే రావాలంటోంది.  ‘ అతడి ముందు నగ్నంగా ఫోటోలు దిగేందుకు.. స్నానం చేసేందుకు.. మసాజ్ చేసేందుకు.. ఇలా పలు పనులకు అస్సలు సహకరించకూడదని ’ సల్మా ఇతర నటీమణులకు హితవు చెప్పింది.

1970వ దశకం నుంచీ లైంగిక వేధింపులకు  పాల్పడుతున్నారంటూ వీన్‌స్టీన్ దురాగతాల గురించి చాలా మంది గొంతు విప్పారు. ఈ క్రమంలో అతనికి అమెరికా నిర్మాతల గిల్డ్ ( పీజీఏ ) జీవితకాల నిషేధం విధించింది. అలాగే బ్రిటిష్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ అకాడెమీ కూడా బహిష్కరించిన విషయం తెలిసిందే.