బక్కపీచు సోగ్గాడు శేఖర్ కమ్ముల - MicTv.in - Telugu News
mictv telugu

బక్కపీచు సోగ్గాడు శేఖర్ కమ్ముల

April 2, 2018

నటి శ్రీరెడ్డి ఇప్పుడు దర్శకుడు శేఖర్ కమ్ములను టార్గెట్ చేసింది. తెలుగు అమ్మాయిలంటే అతని దృష్టిలో పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని తీవ్రంగా విమర్శించింది. తన ఫేస్‌బుక్ ఖాతాలో లీక్స్ అంటూ మొదలు పెట్టింది శ్రీరెడ్డి. 80 ఏళ్ళ చరిత్ర గల  తెలుగు సినీ రంగంలో మహిళలను ఆటబొమ్మల్లా చూశారని అంటోంది శ్రీరెడ్డి. పైకొక కలరిచ్చారు గానీ లోపల వేరే రంగు వుంది. ఆ రంగును బాధితురాళ్ళు ఎవరూ బయట పెట్టకపోయినా తాను బయట పెడతానని అంటోంది శ్రీరెడ్డి. తాజాగా ఆమె శేఖర్ కమ్ములను టార్గెట్ చేయడం తెలుగు సినీ రంగంలో కలకలం రేపుతోంది.‘ గట్టిగా ఊదితే ఎగిరిపోయే ఇతనికి  భయం, బలం రెండూ ఎక్కువే. తెలుగు అమ్మాయిలంటే కేవలం పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని ఈయనగారి ప్రగాఢ విశ్వాసం. మగ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాక్. పెద్ద డైరెక్టర్ అని ఫోజు కొడతాడు. అబద్ధాలు చెప్పడంలో ఈ బక్కపీచు సోగ్గాడుని మించిన దిట్ట ఇంకెవరూ వుండరు. ప్రామిస్‌లను బ్రేక్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. టెక్నికల్‌గా దొరక్కుండా టెక్నాలజీని బాగా వాడాడు. మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు పాపం.  వీరెవరో కాదు కొమ్ములు వచ్చిన శేఖర్ ’ అంటూ శేఖర్ కమ్ములపై విరుచుకుపడింది శ్రీరెడ్డి. దీనిపై దర్శకుడు శేఖర్ కమ్ముల ఎలా స్పందిస్తాడో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘ కొత్తవాళ్ళను తెరకు పరిచయం చేస్తున్న శేఖర్ కమ్ముల ఇలాంటివాడా ? ’ అంటూ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.