కొడుకును రనౌట్ చేసిన తండ్రి..అరుదైన ఘటన.. - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకును రనౌట్ చేసిన తండ్రి..అరుదైన ఘటన..

February 24, 2018

అసలు తండ్రీ – కొడుకులు క్రికెట్‌ ఆడటమే అరుదైతే, కొడుకుని తండ్రి రనౌట్‌ చేయడం ఇంకా ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.వెస్టిండీస్ మాజీ క్రికెటర్ శివనారాయణ్ చందర్‌పాల్ , అతని కొడుకు త్యాగనారాయణ్‌ను రనౌట్ చేసి వార్తల్లో నిలిచాడు.

గత కొన్నేళ్లుగా వీరు ఇద్దరూ కలసి కరీబియన్ దేశవాలీ క్రికెట్ గయానా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా ఇద్దరూ  జరుగుతున్న సూపర్ ఫిఫ్టీ టోర్నీలో క్రికెట్  ఆడారు. శివనారాయణ్ స్ట్రైట్ డ్రెవ్ ఆడగా, బంతిని ఆడ్డుకునే ప్రయత్నంలో బౌలర్ కాలు అడ్డుపెట్టాడు. అతడి కాలికి బంతి బోయిల్స్‌ను పడగొట్టింది. అప్పటికి క్రీజు బయట ఉన్న త్యాగనారాయణ్‌ రనౌటై వెనుదిరగాల్సి వచ్చింది.