హనుమంతుడు దళితుడని క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వండి..

హనుమంతుడు దళితుడని, రామభక్తులు బీజేపీకి, రావణాసురుడి భక్తులు కాంగ్రెస్‌కు ఓటేస్తారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై చాలామంది విమర్శలు సంధించారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజకీయ నేత  శివపాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ కూడా తలదూర్చింది. హనుమంతుడి కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని జిల్లా అధికారులను డిమాండ్ చేసింది.Telugu News Shivpal Yadav demands 'caste certificate' for Lord Hanuman after Yogi Adityanath stoked controversyవారం రోజుల్లోగా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలని లేకపోతే తామంతా ధర్నాలకు దిగుతామని, యూపీ సీఎం యోగి దేవుడిని కుల రాజకీయాల్లోకి లాగాడని, కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయాల్సిందేనని, లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకు తాము భాద్యులం కాదని ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరీశ్ మిశ్రా పేర్కొన్నారు.