mictv telugu

ఏపీలో బీజేపీకి షాక్… రాజమహేంద్రవరం ఎమ్మెల్యే రాజీనామా..

January 7, 2019

రాజమండ్రి ఎమ్మెల్యే  ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్ తగిలినట్టైంది. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన ఆయన స్వయంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు తన రాజీనామా లేఖను అందజేశారు. ఆకుల రాజీనామాపై అమిత్ షాతో సహా, కేంద్ర, రాష్ట్ర స్థాయి నేతలు ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. ఆకుల బాటలో మరికొందరు కీలక నేతలు కమలానికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది.

ఏపీలో అంతంతమాత్రమే ఉన్న బీజేపీకి ఆకుల రాజీనామాతో కోలుకోలేని దెబ్బే తగిలింది.  రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు ఆకుల. ఆయన సతీమణి జనసేనలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆకుల సత్యనారాయణ కూడా బీజేపీలో చేరుతారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.Telugu news Shock of BJP in Andhra Pradesh ... Rajamahendravaram MLA resigns

ఆకుల స్పష్టత..

తన రాజీనామాపై వస్తున్న వార్తలపై  ఆకుల సత్యనారాయణ స్పష్టత ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకునేందుకే తాను ఢిల్లీకి వచ్చానని తెలిపారు. అమిత్ షా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారనీ, త్వరలోనే ఢిల్లీకి తిరిగి వస్తారని స్పష్టం చేశారు. ఆయన అపాయింట్‌మెంట్ తనకు ఇంకా లభించలేదన్నారు. ఆయనను కలిశాక పార్టీ మారడంపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని తెలిపారు.Telugu news Shock of BJP in Andhra Pradesh … Rajamahendravaram MLA resigns