తిరుమలలో  భక్తులకు గాయాలు..!

తిరుపతి వెంకన్న దర్శనానికి అని వెళ్లిన  భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.  శ్రీవారి ఆలయ ప్రవేశద్వారం దగ్గరున్న స్కానింగ్‌ సెంటర్‌ వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో కొందరు  భక్తులకు షాక్‌ తగిలింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు ఒక్కసారిగా  పరుగులు తీశారు.  రద్దీ కొంచెం ఎక్కువగా ఉండడంతో  స్వల్ప తోపులాట చోటుచేసుకొని పలువురు భక్తులకు గాయాలయ్యాయి. గాయాలైన వారికి క్యూలైన్‌లోనే ప్రాథమిక చికిత్స అందించారు అక్కడ సిబ్బంది.  ఈ ఘటనతో శ్రీవారి దర్శనానికి కొంత అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికి  దర్శనానికి  యథావిదిగా కొనసాగించారు ఆలయ అధికారులు.

SHARE