షార్ట్ ఫిలిమ్స్ పోటీ  - MicTv.in - Telugu News
mictv telugu

షార్ట్ ఫిలిమ్స్ పోటీ 

October 23, 2017

తొలుత నుండీ తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ షార్ట్ ఫిలిమ్స్‌ను ప్రోత్సహిస్తూ వస్తోంది. రవీంద్ర భారతి వేదికగా ప్రతి శనివారం  ‘సినివారం’ పేరిట షార్ట్ ఫిలిమ్స్ ఉచితంగా ప్రదర్శిస్తోంది. సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో సినివారం 50 వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నది. ఇప్పటి వరకు చాలా షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శనలు జరిగాయి. నెలకో వారం ‘ టాక్ ఎట్ సినివారం ’ అని సిని ప్రముఖులతో చిట్‌చాట్‌ను నిర్వహిస్తోంది. ఇప్పుడు తాజాగా షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్ను నిర్వహిస్తోంది. “యువ చిత్రోత్సవం”  పేరిట లఘుచిత్రాల పోటీకి ఆహ్వానం పలుకుతోంది.

విషయం : ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో “ యువ చిత్రోత్సవం ” – లఘుచిత్రాల పోటీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ  యువ సినిమా కళాకారులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో భాషా, సాంస్కృతిక శాఖ, సినివారం ఆద్వర్యంలో లఘుచిత్రాల ( షార్ట్ ఫిలిమ్స్ ) పోటీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇటీవలి కాలంలో లఘుచిత్రాలు,డాక్యుమెంటరీలు రూపొందించే యువ దర్శకులు ఎంతో మంది తమదైన సృజనాత్మకతతో ముందుకు వస్తున్నారు. తమ టాలెంట్ కి పదును పెట్టుకుంటూ కొత్తకథలతో, కథనాలతో, టెక్నిక్, టెక్నాలజీతో తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. వీరు తీసిన షార్ట్ ఫిల్మ్ లు కానీ, డాక్యుమెంటరీలు కానీ అద్భుతమైన ప్రశంసలు పొందుతున్నాయి.

అయితే… ఇంతటి నవ్య ఆలోచనలతో దూసుకువస్తున్న నవతరం ఫిల్మ్ మేకర్స్ కి తమ ఫిల్మ్ ని ప్రదర్శించుకునే ప్రివ్యూ థియేటర్స్ కానీ, వేదికలు కానీ కొరతగా ఉన్నాయి. ఉన్నప్పటికి అవన్నీ వ్యయభరితంగా ఉన్నాయి. ఔత్సాహిక యువ దర్శక-రచయిత-నటులు తాము తీసిన లఘుచిత్రాలు/డాక్యుమెంటరీలను ప్రదర్శించాలనుకునే యువ సినీ దర్శకులు ఈ “ సినివారం ” అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్తతరం సినిమాకి ఆహ్వానం పలుకుతున్నారు. ఇలా “ సినివారం ” ఇచ్చిన విజయాన్ని నవతరం సినిమా దర్శకులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ యువ సినిమా కళాకారులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో భాషా సాంస్కృతిక శాఖ, సినివారం ఆద్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా “ యువ చిత్రోత్సవం ” – లఘుచిత్రాల పోటీకి ఔత్సాహికుల నుండి దరఖాస్తులని ఆహ్వానిస్తోంది.

నియమాలు:

* చిత్రాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు భాషని ప్రతిబింభిస్తూ తెలంగాణ జీవనానికి అద్దం పట్టేలా ఉండాలి.

* హింస, అశ్లీలతకి తావు లేకుండా ఇతరుల మనోభావాలను నొప్పించకుండా ఉండే కథాంశాలు ఉండాలి.

* నిడివి 05 నుంచి 20 నిమిషాలు

ఇంతకు ముందు భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన బతుకమ్మ ఫిల్మోవోత్సవం, అవతరణ ఫిల్మోవోత్సవం,

సినివారంలలో ప్రదర్శించిన సినిమాలు యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ ఎంట్రీకి అనుమతించబడవు .

* ఎంట్రీ ఉచితం

* ఎంట్రీ చివరి తేదీ 1 డిసెంబర్ 2017

* ఫలితాలు 16 డిసెంబర్ 2017

* అవార్డ్ ఫంక్షన్ 18 డిసెంబర్ 2017

* తీసిన లఘు చిత్రాలను పెన్ డ్రైవ్ లో కానీ, డి.వి.డి. లో కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, యూట్యూబ్ ప్రైవేట్ లింక్ లేదా నేరుగా రవీంద్రభారతి చిరునామాకు వచ్చి అందివ్వవచ్చు.

* ఈమెయిల్ : telangana [email protected]

Website : www.tsdolc.com.

* ఫోన్ నంబర్ : 9676726726/9849391432/040-23212832

* తుది నిర్ణయం నిర్వాహకులదే

పైన తెలిపిన అంశాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులైన న్యాయ నిర్ణేతల కమిటీ ద్వారా ఉత్తమ చిత్రాలని ఎంపిక చేయటం జరుగుతుంది.

బహుమతులు :

మొదటి బహుమతి : రూIIలు 50,000/-

రెండవ బహుమతి : రూIIలు 40,000/-

మూడవ బహుమతి : రూIIలు 30,000/-

కన్సోలేషన్ బహుమతులు – 3 : ఒక్కోటి రూIIలు 25,000/-

అవార్డ్ పొందిన చిత్రాల దర్శక నిర్మాతలకి నగదు పురస్కారంతో పాటు అవార్డ్, ప్రశంసా పత్రం లభిస్తాయి. పోటీకి వచ్చిన చిత్రాల్లో అర్హమైన వాటిని ప్రతి శనివారం నిర్వహించే “ సినివారం ”లో ప్రదర్శిస్తారు.

ఔత్సాహిక యువ దర్శకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రకటనలో తెలిపారు.