సినిమాల్లోకి ‘గాలి’ కొడుకు! - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాల్లోకి ‘గాలి’ కొడుకు!

November 2, 2017

ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ ( ఓఎంసీ) అధినేత, అక్రమ మైనింగ్ కేసు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు గాలి జనార్ధన్ రెడ్డి. ఇప్పుడు గాలి చూపు సినిమాలవైపు మళ్లింది. తాను స్వయంగా పాడిన పాటల సీడీని విడుదల చేశారు. కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా మంగళవారం రాత్రి ఆయన బెంగుళూరులో ఈ సీడీని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో తన కొడుకు కిరీటిని కూడా సినీరంగానికి పరిచయం చేస్తున్నట్టు ప్రకటించారు. 2018 తరువాత పూర్తి స్థాయిలో సినీరంగం వైపు అడుగులు సారిస్తానని చెప్పారు. గాలి జనార్ధన్ రెడ్డి తన కుమారుణ్ణి తన తన తాహతుకు తగ్గట్టుగా భారీ స్థాయి చిత్రంతోనే సినిమా రంగంలోకి దించుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఓఎంసీ కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు సీజ్ చేసిన బంగారు ఆభరణాలను తిరిగి ఇచ్చేలా గాలి గతంలో పిటిషన్ వేశారు. కోర్టు దీనిని తిరస్కరించింది. అలాగే లండన్‌లో వుంటున్న తన కుమార్తెను చూసి రావడానికి ఈ నెల 5 నుడి 20 వరకు విదేశీ ప్రయాణానికి అనుమతించాలని కోర్టును కోరినా అదీ కోర్టు తిరస్కరణకు గురైంది.