‘శ్రద్ధ’గల నటి  - MicTv.in - Telugu News
mictv telugu

‘శ్రద్ధ’గల నటి 

September 9, 2017

బాలీవుడ్ నటి శ్రధ్దాకపూర్ ఏది చేసినా మనసు పెట్టి చేస్తుంది. ‘ ఆషిఖీ 2 ’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ ను కైవసం చేస్కున్న ఈ నటి తాజాగా బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. శ్రధ్ధా ఇందులో సైనా పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు అన్మోల్ గుప్తా. సైనా పాత్రలో ఒదిగిపోవడానికి శ్రద్ధా బ్యాట్మింటన్ బాగా ప్రాక్టీస్ చేస్తోంది. అదీ సైనా నెహ్వాల్ తోనే. ఈ వంకతో సైనాను చాలా దగ్గరగా గమనించి ఆమె ప్రతీ కదలికను తనలోకి అన్వయించకునే ప్రయత్నంలో తలమునకలై వుంది శ్రధ్ధా. అంతేకదా ఒకరి పాత్రను చెయ్యటం అంటే అంతా ఆశామాషీ కాదు. వాళ్ళలా తము అయిపోవాల్సి వస్తుంది. శ్రధ్ధా ఇప్పటికే నటించిన ‘ హసీనా పార్కర్ ’  సెప్టెంబర్ 22 న విడుదల అవుతున్నది. ఆ సినిమా దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ బయోపిక్ అవటం విశేషం.

 ఇప్పుడు మళ్ళీ ఇంకొక బయోపిక్ లో నటించడం అంటే అంత ఈజీ విషయం కాదు. ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి పరకాయం ప్రవేశం చెయ్యటం అంత సులువైన పని కాదు కాబట్టే శ్రద్ధా ఇలా ప్లాన్ చేస్కుంది. ఆర్నెల్లు సావాసం చేస్తే నేను నువ్వు అవుతావు – నువ్వు నేనౌతాను అన్న సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నట్టున్నది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. త్వరలో సానియా మీర్జా బయోపిక్ కూడా రానుంది.