దిల్‌రాజు టాలీవుడ్‌కు పట్టిన శని.. శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

దిల్‌రాజు టాలీవుడ్‌కు పట్టిన శని.. శ్రీరెడ్డి

April 11, 2018

టాలీవుడ్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తార శ్రీరెడ్డి నిన్న ఓ ఛానల్‌లో నిర్మాత డి. సురేష్ బాబు తనయుడు దగ్గుపాటి అభిరామ్ పేరును బయట పెట్టింది.  అతను ఓ దుర్మార్గుడని, ఎందరో అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని చెప్పి వాపోతూ, అతనితో సన్నిహితంగా వున్న ఫోటోను బయటపెట్టింది. అది మరవక ముందే నిర్మాత దిల్‌రాజు పేరును కూడా బయట పెట్టింది. ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టి, అతను టాలీవుడ్‌కు పట్టిన శని.. అతను చచ్చిపోతేనే టాలీవుడ్‌కు పట్టిన శని వదిలిపోతుంది అని వ్యాఖ్యానించింది.ఈ నేపథ్యంలో శ్రీరెడ్డికి మహిళా సంఘాలు, సామాజిక వేత్తల నుంచి శ్రీరెడ్డికి సపోర్ట్ లభించడం విశేషం. ఇంతకాలం ఆమె చేసిన పోరాటం ఓ ఎత్తయితే, ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లు, కనిపిస్తున్న సాక్ష్యాలు మరో ఎత్తని మహిళా ఉద్యమకారులు అంటున్నారు. శ్రీరెడ్డి బయట పెట్టిన వాళ్ళంతా స్పందించాల్సిన అవసరం వుందని వారు డిమాండ్ చేస్తున్నారు. డి. సురేష్ బాబు, హీరో వెంకటేష్, రాణా, దిల్‌రాజులు స్పందించాలని కోరుతున్నారు. ఆధారాలను బట్టి వారి వారి మీద కేసులు నమోదు చెయ్యాలని పోలీసులకు డిమాండ్ చేస్తున్నారు. ఒక ఆడపిల్ల ఒంటరిగా టాలీవుడ్ ప్రక్షాళనకు ఉద్యమం చేస్తుంటే ఒక్కరు కూడా స్పందించకపోవటం బాధాకరం అంటున్నారు. ఆమెకు మాలో సభ్యత్వం ఎలా రిజెక్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఒక నిస్సహాయ స్థితిలోనే శ్రీరెడ్డి బట్టలు విప్పి తన నిరసన తెలిపింది.. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఎంతకూడా లేదని పలువురు విద్యార్థి సంఘాలు శ్రీరెడ్డికి మద్దత్తు పలుకుతున్నాయి. ఇంకా శ్రీరెడ్డి ముందు ముందు ఎవరెవరి పేర్లను బయటపెడుతుందోనని చాలామందికి గుబులు రేగుతున్న సందర్భం నెలకొనివుంది.