mictv telugu

వచ్చే ఐపీఎల్‌ ‘ఢిల్లీ క్యాపిటల్స్’ కెప్టెన్ ఇతడే..!

December 5, 2018

ఐపీఎల్‌లో వరుసగా విఫలమవుతున్న ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ భారీ మార్పులతో వచ్చే ఏడాది రంగంలోకి దిగబోతోంది. ఇందులో భాగంగానే సపోర్టింగ్‌ స్టాఫ్‌ మొత్తాన్ని బలోపేతం చేసింది. గౌతమ్ గంభీర్‌ను పంపించేసి… శిఖర్ ధావన్‌ను జట్టులోకి తీసుకుంది.Telugu News Shreyas iyer will be new full time captain for delhi capitalsఅంతే కాకుండా ఏకంగా పేరును, లోగోనూ కూడా మార్చేసి ‘ఢిల్లీ క్యాపిటల్స్‌’గా రంగంలోకి దిగబోతోంది. ఇక… యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ను ఫుల్‌ టైమ్‌ కెప్టెన్‌గా నియమించింది. గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్‌గా చేయగా… చివర్లో జరిగిన మ్యాచ్‌లకు శ్రేయస్‌కే పగ్గాలు అప్పగించారు. రాబోయే సీజన్‌లో శ్రేయస్‌‌నే పూర్తిస్థాయి కెప్టెన్‌గా కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నిర్ణయించింది.