ఉపాసన సోదరుడితో శ్రియా భూపాల్ నిశ్చితార్థం - MicTv.in - Telugu News
mictv telugu

ఉపాసన సోదరుడితో శ్రియా భూపాల్ నిశ్చితార్థం

April 23, 2018

నిశ్చితార్థం అయ్యాక హీరో అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. రెండు కుటుంబాల మధ్య ఏవో తగాదాలు వచ్చాయని.. అఖిల్, శ్రియా భూపాల్‌ల మధ్య కూడా మనస్ఫర్థలు వచ్చాయని, అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై అటు నాగ్ కానీ, జీవీకే నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదు.

ఇదిలా వుండగా శ్రియా భూపాల్, అనిందిత్ రెడ్డిల నిశ్చితార్థం జరిగింది. అనిందిత్ రెడ్డి రాంచరణ్ భార్య ఉపాసనకు సోదరుడి వరస అవుతాడు. ఉపాసన వాళ్ళమ్మ, అనిందిత్ రెడ్డి అమ్మలు అక్కాచెళ్ళెళ్ళు అవటం విశేషం. అపోలో హాస్పటల్స్ ఛైర్మన్, ఫౌండర్ ప్రతాప్ సి. రెడ్డికి మనవడు కూడా. ఈ నిశ్చితార్థం కార్యక్రమంలో టి. సుబ్బరామిరెడ్డి కూతురైన పింకీ రెడ్డి పుట్టినరోజు పార్టీ కూడా జరిగింది. రాం చరణ్, ఉపాసన జంట ఈ పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని తెలుస్తోంది. పలువురు ప్రముఖులు కూడా హజరయ్యారని సమాచారం. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను పింకీ రెడ్డి తన ఇన్‌స్ట్రాగ్రమ్ ద్వారా షేర్ చేశారు.