ఓయూ విద్యార్థుల అండ.. శ్రీరెడ్డి కంట కన్నీరు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఓయూ విద్యార్థుల అండ.. శ్రీరెడ్డి కంట కన్నీరు..

April 11, 2018

కొన్ని దశాబ్దాలుగా తెలుగు పరిశ్రమను పట్టి పీడిస్తున్న కాస్టింగ్ కౌచ్ గురించి నటి శ్రీరెడ్డి బయటకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డికి చాలా వ్యతిరేకత ఎదురవుతోంది. అదే స్థాయిలో మద్దతు కూడా లభిస్తోంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి శ్రీరెడ్డికి మద్దతు లభించింది. ఓయూ విద్యార్థి లోకమంతా ఆమెను యూనివర్సిటీకి ఆహ్వానించి అండగా నిలుస్తున్నట్టు ఓయూ విద్యార్థి సంఘం జేఏసీ ఒక ప్రకటనలో తెలిపింది.


 ఈ సందర్బంగా ఓయూలో విలేకరులతో మాట్లాడిన శ్రీ రెడ్డి  కన్నీళ్ళు పెట్టుకుంది. ‘అన్నా.. మీరందరూ నాకు అండగా నిలబడటం చాలా సంతోషంగా వుంది. తెలుగు ఆడబిడ్డ అన్యాయానికి గురవుతుంటే తెలుగు అన్నలు ఎవరూ ఊరుకోరని మీరు నిరూపించారు. మీకు పేరుపేరునా ధన్యవాదాలు అన్నా. నేనొక్కదాన్నే కాదు చాలామంది తెలుగు చెల్లెళ్లు బడాబాబుల చేతుల్లో నలిగిపోతున్నారు. మా అందరికీ మీ మద్దత్తు, మీ నుంచి సేఫ్టీ కావాలి అన్న..  ’ అంటూ ఉద్వేగంతో చెప్పింది.

ఇదిలా వుండగా శ్రీరెడ్డి ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, తనకు ఎవరెన్ని బిస్కెట్లు వేసినా తన ఉద్యమం ఆపను అంటోంది శ్రీరెడ్డి. దశాబ్దాలుగా సాగుతున్న దురాచారాన్ని రూపుమాపేదాకా తన ఉద్యమం ఆగదు అంటోంది. ఇప్పుడిప్పుడే కొంత మంది అమ్మాయిలు బయటకు వచ్చి ఇండస్ట్రీలో తమకు జరిగిన అన్యాయం గురించి చెప్తున్నారు.