శ్రియా భూపాల్ పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కజిన్ అనిన్దిత్తో ఆమె పెళ్ళి నిశ్చయించినట్టు తెలుస్తున్నది. అక్కినేని అఖిల్‌తో శ్రియా భూపాల్ నిశ్చితార్థం అయి చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన విషయం విదితమే.
కాగా ఈ విషయంలో అక్కినేని కుటుంబం నుంచి కానీ, జీవీకే కుటుంబం నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదు. అఖిల్, నాగ చైతన్య పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతాయనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. అఖిల్, శ్రీయల నిశ్చితార్థం విరిగిపోయేసరికి.. నాగచైతన్య, సమంతల పెళ్ళి జరిగిపోయింది. కాగా ఇప్పుడొస్తున్న శ్రీయ పెళ్లి వార్తలపై శ్రీయా భూపాల్, ఆమె కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది