శ్రియ పెళ్లి డేట్ ఫిక్స్.. వరుడు అతడే - MicTv.in - Telugu News
mictv telugu

శ్రియ పెళ్లి డేట్ ఫిక్స్.. వరుడు అతడే

February 28, 2018

త్వరలో నటి శ్రియ శరన్ పెళ్లి అని ఇటీవల వచ్చిన వార్తలు నిజమే. ఆమె భారీస్థాయిలో షాపింగ్ చేయడంతో ఇలా వార్తలొచ్చాయి. అయితే అవి నిజం కాదని ఆమె తల్లి చెప్పింది. శ్రియ మాత్రం స్పందించలేదు. అయితే పెళ్లి ఫిక్సయింది నిజమేనని తాజా సమాచారం.

శ్రియ రష్యాకు చెందిన వ్యాపారవేత్త, క్రీడాకారుడైన ఆండ్రీ కుశ్చేవ్ ప్రేమ పెళ్లి చేసుకోనుంది. వీరిద్దరూ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు.  ఉదయ్‌పూర్‌లో మార్చి 18న ఘనంగా జరగనుంది. ఓ ప్యాలెస్‌లో 17న సంగీత్‌తో వివాహ వేడుక ప్రారంభం కానుంది.

ఇక 18న హిందూ సంప్రదాయం ప్రకారం శ్రియ, ఆండ్రి పెళ్లి  జరగనుంది. 19న  అతిథులకు,స్నేహితులకు ,సినీ ప్రముఖులకు వివాహ విందు ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత మళ్లి మాస్కో‌లో కూడా మరో వివాహ విందూ ఉన్నట్టు తెలుస్తోంది. మూడు వారాల కిందట శ్రియ పెళ్లి రష్యన్ బాయ్ ప్రెండ్‌తో వచ్చిన వార్తలను శ్రాయ తల్లి ఖండించింది. శ్రియ తన స్నేహితురాలి పెళ్లి కోసం షాపింగ్ చేసిందని చెప్పుకొచ్చింది.