త్వరలోనే శ్రుతిహాసన్ పెళ్లి.. వరుడు అతడే - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలోనే శ్రుతిహాసన్ పెళ్లి.. వరుడు అతడే

November 30, 2017

ప్రముఖ నటి శ్రుతి హాసన్, బ్రిటిష్ నటుడు మైఖేల్ కోర్సెల్  డేటింగ్ లో ఉన్నారన్న విషయం పాతదే.. చాలా సార్లు మైఖేల్‌ను ముంబైకి కూడా తోలుకొచ్చింది శ్రుతి. తాజాగా తన తల్లి సారికకు అతణ్ని పరిచయం చేసింది. శ్రుతి, మైఖేల్, సారిక కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాంతో త్వరల్లోనే శ్రుతి పెళ్లి పీటలెక్కనున్నట్లు సినీ సమాచారం.శ్రుతి ఎప్పుడూ తన ప్రేమ గురించి మీడియాకు చెప్పలేదు. తన వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం తనకు ఇష్టం ఉండదంటూ ప్రేమ విషయాన్ని చెప్పింది. తన తల్లికి మైఖేల్‌ను పరిచయం చేసింది కాబట్టి త్వరలోనే శ్రుతి పెళ్లి కబురు వినిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం శ్రుతి ‘శభాష్ నాయుడు’ చిత్రంలో నటిస్తోంది. టి.కె రాజీవ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాని రాజ్ కమల్ ఫిల్మ్ పతాకంపై కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు.