కువైట్‌లో సహజీవనం.. కడపకు వచ్చాక తెలీదంట! - MicTv.in - Telugu News
mictv telugu

కువైట్‌లో సహజీవనం.. కడపకు వచ్చాక తెలీదంట!

March 30, 2018

ఆరు నెలలు ఆమెతో సహజీవనం చేశాడు.. వారికి ఆరు నెలల మగబిడ్డ కూడా వున్నాడు.. పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చాడు.. చివరికి ఆమె ఎవరో తనకు తెలియదంటున్నాడు.. దీంతో ఆమె అతని ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది.  వైఎస్సార్‌ కడప జిల్లా సంబేపల్లి మండల పరిధిలోని రౌతుకుంట గ్రామం కొత్తపల్లెలో జరిగింది ఈ ఘటన.

కొత్తపల్లెకు చెందిన ఇంజేటి జయమ్మ అదే గ్రామం వంగిమళ్లవాండ్లపల్లెకు చెందిన నాగూరి బాబాజీ గత కొన్నేళ్లుగా కువైట్‌లో సహజీవనం చేస్తున్నారు. వీరికి 6 నెలల మగబిడ్డ కూడా ఉన్నాడు. పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చిన బాబాజీ స్వదేశానికి వచ్చిన తర్వాత మాట మార్చాడు. జయమ్మతో తనకు ఎలాంటి సంబంధం లేదు.. ఆమె ఎవరో తనకు తెలియదు అంటున్నాడు. దీంతో బాధితురాలు జయమ్మ చేసేదేమీ లేక బాబాజీ ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది. జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు బాబాజీపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.