జాతీయగీతంలో సింధ్ వద్దు.. రాజ్యసభలో బిల్లు - MicTv.in - Telugu News
mictv telugu

జాతీయగీతంలో సింధ్ వద్దు.. రాజ్యసభలో బిల్లు

March 16, 2018

జాతీయగీతంలో ‘సింధ్’ అనే పదాన్ని తొలగించాలని కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా రాజ్యసభలో  బిల్లును ప్రవేశపెట్టారు. సింధ్ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ఈశాన్య పదాన్ని చేర్చాలని కోరారు. ఈశాన్య  ప్రాంతానికి భారత్‌‌లో చాలా ప్రముఖ్యత ఉందని, జాతీయగీతంలో ఈశాన్య ప్రాంతం గురించి ప్రస్తావన లేకపోవడం చాలా బాధగా ఉందని తెలిపారు. ఇప్పుడు సింధ్ ప్రాంతం మనకు శత్రుదేశమైన పాకిస్తాన్‌లో ఉందని, దానితో మనకు సంబంధం లేదని వివరించారు.కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జాతీయగీతంలో పదాల్లో మార్పులను చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని 1950 జనవరి 24న అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ చెప్పిన విషయాన్ని బోరా ఈ సందర్బంగా గుర్తు చేశారు. 2016లోనూ శివసేన ఎంపీ అరవింద్ సావంత్ కూడా సింధ్ పదాన్ని తొలగించాల్సిందిగా డిమాండ్ చేశారు.